Published : 22 Mar 2021 14:33 IST

ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు

ఫుల్‌ ఫన్నీగా ‘జాతిరత్నాలు’ మేకింగ్‌..!

హైదరాబాద్‌: నవీన్‌పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌.. వెండితెరపై ఈ ముగ్గురు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాతిరత్నాలు’ ఇటీవల విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. నవీన్‌ వేసే పంచులు, రాహుల్‌, ప్రియదర్శిల మధ్య వచ్చే సంభాషణలు, ముఖ్యంగా కోర్టు సీన్‌ కామెడీకి ప్రతి ఒక్కరూ పూర్తిగా కనెక్ట్‌ అవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సూపర్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా ఆ సినిమా మేకింగ్‌ వీడియోని చిత్రబృందం తాజాగా షేర్‌ చేసింది. మేకింగ్‌లో నటీనటులు చేసిన అల్లరి, రిహార్సల్స్‌.. ఇలా ప్రతి విషయాన్ని తెలియజేసే విధంగా ఈ వీడియో సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్‌ వీడియో ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తోంది.

అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్‌కు జంటగా ఫరియా అబ్దుల్లా నటించారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. స్వప్నా సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నరేష్‌, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని