Atlee: హాలీవుడ్‌ నుంచి కాల్‌ వచ్చింది.. స్పానిష్‌ ఫిల్మ్‌ తీయొచ్చేమో: ‘జవాన్‌’ డైరెక్టర్‌

షారుక్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్లీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

Updated : 24 Sep 2023 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘జవాన్‌’ (Jawan) విజయంతో దర్శకుడు అట్లీ (Atlee) పేరు జాతీయ స్థాయిలో మార్మోమోగుతోంది. సినిమా విడుదల నుంచి ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ‘జవాన్‌’ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ హాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, సాంకేతిక నిపుణులకూ బాగా నచ్చిందని, ఆ విషయం తనకు ఫోన్‌ చేసి చెప్పారని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. భాష పరంగా సినిమాకు పరిధులు లేవని పేర్కొంటూ తదుపరి స్పానిష్‌ ఫిల్మ్ డైరెక్ట్‌ చేయొచ్చేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కథ బలంగా ఉంటే ఏ దర్శకుడైనా ఏ భాషలో అయినా సినిమాలు తెరకెక్కించొచ్చనే ఉద్దేశంలో చెప్పారు. ఆయా హీరోలతో పరిచయం పెంచుకుని, వారితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రతి సినిమాని ప్రారంభిస్తానన్నారు. సినిమా సినిమాకు నేపథ్యాన్ని మారుస్తుంటానని తెలిపారు.

పెళ్ళి చేసుకుంటే హేళన చేశారు: అట్లీ

తన కథలతో ప్రేక్షకులకు వినోదం పంచడంతోపాటు కాస్త సందేశాన్ని ఇవ్వాలనుకుంటానని పేర్కొన్నారు. ఫ్లాష్‌బ్యాక్‌, హీరోయిన్‌ పాత్రతో ప్రతి సినిమా కథను రాయడం ప్రారంభిస్తానని తెలిపారు. ‘‘దీపికా పదుకొణె పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో చనిపోతుందా? అని జవాన్‌ సినిమా విడుదలవక ముందే కొందరు నన్ను అడిగారు. ఫ్లాష్‌బ్యాక్‌ అనగానే క్యారెక్టర్‌ కిల్‌ అవుతుందనే వారు ఊహిస్తున్నారు. తదుపరి చిత్రం నుంచి వారి ఊహకు అందని విధంగా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని అన్నారు.

షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan), నయనతార (Nayanthara), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జవాన్‌’ సెప్టెంబరు 7న విడుదలై ఇప్పటి వరకు రూ. 953కోట్లకుపైగా (jawan collections) వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది. దాంతో, అట్లీ తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడా? అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ఈ క్రమంలో టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్‌ (Allu Arjun)తో అట్లీ సినిమా చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని