Jawan: ‘జవాన్‌’ విడుదల తేదీ ఖరారు

అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్‌’. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ఖరారు చేశారు.

Updated : 07 May 2023 14:12 IST

గ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్‌’. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ఖరారు చేశారు. సెప్టెంబరు 7న ఈ చిత్రం విడుదల కానుందంటూ షారుక్‌ శనివారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీజర్‌తోపాటు, ఓ ప్రచార చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. నయనతార, విజయ్‌సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుంది.


కొత్త కొత్తగా...

ప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్‌ పృథ్వీ దర్శకుడిగా మారారు. తన కుమార్తె శ్రీలుని కథానాయికగా పరిచయం చేస్తూ ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమాని తెరకెక్కించారు. క్రాంతి కథానాయకుడు. పద్మరేఖ, గుంటక శ్రీనివాస్‌రెడ్డి, కె.కృష్ణారెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. విడుదలకి సిద్ధమైన ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ నటుడు నాగబాబు విడుదల చేశారు. కార్యక్రమంలో సుమన్‌, నాయకానాయికలతోపాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని