ఇది పోరాటం కాదు.. మహా సంగ్రామం..

‘నువ్వు ఈ భూమిని ఎన్ని వేల అడుగుల ఎత్తు నుంచి చూసి ఉంటావు. ఏడు లక్షల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిని

Published : 31 Dec 2020 19:24 IST

హైదరాబాద్‌: ‘నువ్వు ఈ భూమిని ఎన్ని వేల అడుగుల ఎత్తు నుంచి చూసి ఉంటావు. ఏడు లక్షల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిని చూశాను నేను’ అంటున్నారు’ తమిళ నటుడు జయం రవి. ఆయన కథానాయకుడిగా లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భూమి’. నిధి అగర్వాల్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. వ్యవసాయం నేపథ్యంలో ‘భూమి’ తెరకెక్కింది. ఇందులో జయం రవి రైతుగా కనిపించనున్నారు. శంకర్‌ సినిమా తరహాలో ఇందులో సామాజిక సందేశం ఇమిడి ఉన్నట్లు చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ తెలిపారు. రోనిత్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

ఇవీ చదవండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని