Jayamma Panchayathi: ఓటీటీలో ‘జయమ్మ పంచాయతీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘జయమ్మ పంచాయతీ’.

Updated : 07 Dec 2022 20:25 IST

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘జయమ్మ పంచాయతీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 14 నుంచి ‘జయమ్మ పంచాయతీ’ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.  ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందించారు.

క‌థేంటంటే: కొంచెం భోళాత‌నం.. మ‌రికొంచెం జాలిగుణం మొండిత‌నం క‌ల‌గ‌ల‌సిన మ‌హిళ జ‌య‌మ్మ (సుమ‌). ఆమె గురించి తెలిసిన‌వాళ్లు మ‌చ్చ లేని మ‌న‌సు అంటారు. ఊళ్లో స‌మ‌స్య‌ల‌న్నీ త‌న స‌మ‌స్య‌లుగా భావిస్తుంటుంది. పొరుగోళ్ల‌కి సాయం చేయ‌డ‌మంటే ఇష్టం. తిరిగి సాయం చేయ‌క‌పోతే మాత్రం ఊరుకోదు. ఊరంతా త‌న‌దే అనుకునే త‌త్వం. కుటుంబంతో క‌లిసి హాయిగా జీవితం గ‌డుపుతుంటుంది.  ఇంత‌లోనే భ‌ర్త (దేవీప్ర‌సాద్‌)కి జ‌బ్బు చేస్తుంది. డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. త‌నకి ఎదురైన ఈ స‌మ‌స్య తీరాలంటే పంచాయితీకి వెళ్లాల్సిందే అని నిర్ణ‌యిస్తుంది. కానీ పంచాయితేమో వేరే స‌మ‌స్య‌తో త‌ల‌మున‌క‌లై ఉంటుంది. మ‌రి జ‌య‌మ్మ సమ‌స్య‌కి ప‌రిష్కారం దొరికిందా? లేదా?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని