Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
పవన్‌కల్యాణ్ (Pawan kalyan) - త్రిష (Trisha) జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘తీన్‌మార్’ (Teenmaar). సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా పరాజయంపై దర్శకుడు స్పందించారు.
హైదరాబాద్: ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారూ బాగున్నారా?’, ‘ప్రేమంటే ఇదేరా’.. వంటి ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రాలను ఒకప్పుడు ప్రేక్షకులకు అందించి సూపర్‌హిట్స్ అందుకున్నారు దర్శకుడు జయంత్ సి.పరాన్జీ (Jayanth C Paranjee). 2011లో విడుదలైన ‘తీన్‌మార్’ పరాజయం తర్వాత తెలుగు తెరకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలు పరాజయం అందుకోవడంపై స్పందించారు. ఇందులో భాగంగా ‘తీన్‌మార్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో ఇమేజ్ కూడా ఒక సమస్య అయి ఉండొచ్చని చెప్పారు.
‘‘సినిమా రిజల్ట్ పక్కన పెడితే ‘తీన్‌మార్’ నాకిప్పటికీ ఒక ప్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. అయితే అది ఫెయిల్ కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకూ పవర్‌స్టార్ ఇమేజ్‌కు ఇది సరిపోలేదు. కొంతమంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో వివాహం చేయడం.. ఆ తర్వాత ఆమె తిరిగి పవన్‌కల్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లకు నచ్చలేదు. ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోల్లో ఎవరో ఒకరితో తీసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో’’ అని ఆయన వివరించారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా ‘తీన్‌మార్’ తెరకెక్కింది. పవన్‌కల్యాణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. త్రిష, కృతి కర్బంద కథానాయిక. మ్యూజికల్‌గా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే