Jayasudha: ఆ భయంతోనే అజిత్‌ సినిమాలో నటించలేదు: జయసుధ

ఇటీవల విడుదలైన వారిసు(Varisu) సినిమాలో తల్లి పాత్రలో మెప్పించారు నటి జయసుధ(Jayasudha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇప్పటి వరకు అజిత్‌ సినిమాలో ఎందుకు నటించలేదో తెలిపారు.

Published : 30 Jan 2023 13:18 IST

హైదరాబాద్‌: వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) నటించిన సినిమా ‘వారిసు’ (Varisu). ఇటీవల విడుదలైన ఈ చిత్రం తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్‌ తల్లి పాత్రలో జయసుధ (Jayasudha) నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు హీరో అజిత్‌ (Ajith) సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘ఇప్పటి వరకు ఎంతోమంది నటులకు అమ్మగా నటించారు. కానీ అజిత్‌కు అమ్మగా ఎందుకు చేయలేదు?’  అని అడిగారు.

‘‘నాకు అజిత్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక రోజు షూటింగ్‌కు కూడా హాజరయ్యాను. అయితే కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్‌ సగంలోనే ఆగిపోయింది. తర్వాత షూటింగ్‌ మొదలైనా.. కొవిడ్‌ భయం కారణంగా ఆ సినిమా నుంచి వైదొలిగాను. నా బదులుగా ఆ పాత్రలో సుమిత్ర నటించింది’’ అని జయసుధ తెలిపారు. ఈ ఏడాది సంక్రాతికి అజిత్‌, విజయ్‌ల సినిమాలు విడుదలవ్వగా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కోల్డ్‌ వార్‌ నడిచిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని