Jeevitha: మాపై ఆరోపణలు నిరాధారం: నేడు సమాధానం చెబుతానన్న జీవితా రాజశేఖర్‌

రేదో చేశారంటూ నటులు, దంపతులు రాజశేఖర్‌, జీవితలపై శుక్రవారం కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయమై కథనాలు వెలువడ్డాయి.

Updated : 23 Apr 2022 04:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో మోసం చేశారంటూ నటులు, దంపతులు రాజశేఖర్‌, జీవితలపై శుక్రవారం కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఓ సినిమా నిర్మించేందుకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఇప్పుడు వాటిని తిరిగి ఇమ్మంటే ఇవ్వడంలేదంటూ సదరు వ్యక్తులు రాజశేఖర్‌, జీవితలపై ఆరోపణలు చేశారు. వీటిపై జీవిత స్పందించారు. తమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై.. శనివారం నిర్వహించనున్న ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌ మీట్‌లో మాట్లాడతానన్నారు. పూర్తి ఆధారాలతో అక్కడకు వస్తానని తెలిపారు. అప్పటి వరకూ ఎవరూ ఎలాంటి కథనాలు ప్రసారం చేయొద్దని కోరారు. రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రమే ‘శేఖర్‌’. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని