Jhansi: ఉత్కంఠగా అంజలి ‘ఝాన్సీ’ ట్రైలర్‌

ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నటి అంజలి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఝాన్సీ’ సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 15 Oct 2022 14:22 IST

హైదరాబాద్‌: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఇందులో అంజలి.. తన గతాన్ని తెలుసుకోవడం కోసం శ్రమించే యువతి పాత్రలో కనిపించారు. ‘‘ఒక మనిషి జీవితంలో అన్నింటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకే తెలియకపోవడం’’ అనే సంభాషణలతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. ‘‘నా ఫ్రెండ్స్‌ ఎవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు. కానీ నా శత్రువు ఎవరో నాకు తెలియాలి’’ అంటూ ట్రైలర్‌ చివర్లో ఆమె చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా అక్టోబర్‌ 27న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని