Jhansi review: రివ్యూ: ఝాన్సీ.. అంజలి నటించిన సిరీస్ ఎలా ఉందంటే?
అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్‘ఝాన్సీ’. ‘డిస్నీ+హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందంటే?
Jhansi web series Review సిరీస్: ఝాన్సీ; నటీనటులు: అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, ముమైత్ ఖాన్, సంయుక్తా హర్నాద్ తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; కూర్పు: ఆంథోనీ; ఛాయాగ్రహణం: అర్వి; నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాలన్; దర్శకత్వం: తిరు; స్ట్రీమింగ్ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్.
అటు సినిమా, ఇటు సిరీస్‌ల్లో నటిస్తోన్న కథానాయికల్లో అంజలి (Anjali) ఒకరు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘ఝాన్సీ’ (Jhansi). ప్రస్తుతం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, అంజలి ఈసారి ఎలాంటి క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు? తన పాత్రకు న్యాయం చేశారా? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..
ఇదీ కథ: సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ)కు తన కుమార్తె మేహ అంటే అమితమైన ప్రేమ. ఉద్యోగంలోపడి కూతురిని బాగా చూసుకోవడంలేదనే కారణంతో భార్య సాక్షి (సంయుక్తా)కి దూరంగా ఉంటాడు. మేహను తీసుకుని ఓసారి కేరళకు విహార యాత్ర వెళ్తాడు సంకీత్. ప్రమాదంలో పడబోతున్న మేహను అక్కడే ఉన్న ఓ అమ్మాయి (అంజలి) రక్షిస్తుంది. ఆమెకు తానెవరో, తన గతం ఏంటో తెలియదు. కూతురిని కాపాడిందనే కృతజ్ఞతాభావంతో ఆ అమ్మాయిని సంకీత్ తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమెకు ఝాన్సీ అనే పేరు పెడతాడు. ఝాన్సీ మామూలు మనిషికాగానే ఆమెతో ఓ బొటిక్‌ను ప్రారంభిస్తాడు. అప్పటికే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండటంతో ఝాన్సీ ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచుతాడు. ఇదిలా ఉంటే, గతంలో జరిగిన సంఘటలనకు సంబంధించిన దృశ్యాలు ఝాన్సీ కళ్లలో అప్పుడప్పుడూ మెదులుతుంటాయి. బాలికలు, మహిళలకు అన్యాయం జరిగితే సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది. ఏ ఆధారాల ద్వారా ఝాన్సీ తన గతం గురించి తెలుసుకుంది? ఆ క్రమంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంది? సంకీత్‌తో పెళ్లికి ఓకే చెప్పిందా, లేదా? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: మన చుట్టూ చోటు చేసుకునే సంఘటనల గురించి చెప్పేందుకే చాలామంది రచయితలు, దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సిరీస్‌నూ ఆ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు తిరు, రచయిత గణేశ్ కార్తీక్. ఆరు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో.. డబ్బు కోసం బాలికలు, మహిళలను కొందరు దుర్మార్గులు ఎలా హింసిస్తారో, వారి వల్ల జీవితాలు ఎలా తలకిందులవుతాయో చూపించారు. ‘కథ పరంగా ఈ సిరీస్ పలు సినిమాలను పోలి ఉంది’ అని ప్రేక్షకుడు భావించే అవకాశం ఉంది. ఏదో ప్రమాదం జరగడం, గతాన్ని మర్చిపోయిన హీరోనో హీరోయినో వేరొకరి దగ్గర ఉండటం.. అప్పుడప్పుడు జ్ఞాపకాలు గుర్తుకురావటం.. అసలు ‘నేనెవరు?’ అని తెలుసుకునే ప్రయత్నం చేయటం.. ఇప్పటికే చాలా చిత్రాల్లో కనిపించాయి. కానీ, ఈ సిరీస్‌లో కథానాయిక గతాన్ని, సామాజిక రుగ్మతకు ముడిపెట్టి నడిపిన స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. తొలి రెండు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగినా మూడో ఎపిసోడ్ నుంచి కథలో వేగం పుంజుకుంది. ఝాన్సీ ఎవరు? అనే ఉత్సుకత కలుగుతుంది. ఝూన్సీ గతాన్ని రివీల్ చేసిన తీరు మెప్పిస్తుంది.
ఈ క్రమంలో కొన్ని సీన్లలో స్పష్టత లోపించింది. కొన్ని పాత్రల్లో క్లారిటీ మిస్ అయింది. తనలోకి ఏదో శక్తి ప్రవేశించినట్టు ఝూన్సీ.. మహిళలు, చిన్నారులను హింసించే వారిని హత్య చేయటం.. ఆ దందా నడిపే హెడ్ ఎవరో అన్వేషించే క్రమంలో తన అసలు పేరు తెలుసుకోవటం, చాందినీ చౌదరి క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వటం.. హత్య కేసులను చేధించేందుకు పోలీసు అధికారి అయిన సాక్షి (సంకీత్ భార్య) రంగంలోకి దిగటం.. తదితర సన్నివేశాలు మంచి అనుభూతి పంచుతాయి. ప్రేక్షకులు సీజన్ 2 కోసం వేచి చూసేలా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే: నటిగా వెండితెరపై తానేంటో పలు విభిన్న పాత్రలతో నిరూపించుకున్నారు అంజలి. ఝూన్సీతో మరోసారి తనదైన ముద్రవేశారు. గతానికి సంబంధించిన క్యారెక్టర్, వర్తమాన క్యారెక్టర్‌లోనూ ఒదిగిపోయారు. చాందిని చౌదరి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా కనిపించనంత మేర ఆకట్టుకుంది. పలు ఐటెమ్ సాంగ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఈ సిరీస్‌లో నెగెటివ్ ఛాయలున్న పాత్ర పోషించారు. ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్తా హర్నాద్ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ప్రదీప్ రుద్ర, దేవయాని శర్మ, అభిరామ్ వర్మ తదితరుల నటన ఓకే అనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల సన్నివేశాలకు తగ్గట్టు నేపథ్య సంగీతం అందించారు. అర్వి.. విజువల్స్ ఫర్వాలేదు. నిడివి పరంగా ఓకే అనిపించినా కొన్ని బోరింగ్ సన్నివేశాల విషయంలో ఆంథోనీ ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. తిరు టేకింగ్ బాగుంది.
బలాలు
+ అంజలి నటన
+ అక్కడక్కడా కొన్ని ట్విస్ట్‌లు
బలహీనతలు
- రొటీన్ కథ
- క్లారిటీలేని కొన్ని సన్నివేశాలు
చివరిగా: ఝాన్సీ.. కథ తెలిసిందే.. జర్నీ కొత్తగా ఉంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి