jilebi movie ott: ఓటీటీలో ‘జిలేబి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Jilebi ott: గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, వినోదాన్ని పంచిన ‘జిలేబి’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 10 Jul 2024 14:23 IST

హైదరాబాద్‌: శ్రీకమల్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా సీనియర్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌ (Vijay Bhaskar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిలేబి’ (Jilebi ott).  గుంటూరు రామకృష్ణ నిర్మాత. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జులై 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

ఇంతకీ కథేంటంటే: స్నేహితులతో కలిసి చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటాడు కమల్ (శ్రీ కమల్). ఒకరోజు లక్ష్మీ భారతి అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్) కమల్‌ ఉండే హాస్టల్లోకి ప్రవేశిస్తుంది. అబ్బాయిలు ఉండే హాస్టల్లోకి వెళ్లిన జిలేబీ బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో కమల్‌ తన స్నేహితులు బుజ్జి (సాయి కుమార్ బబ్లూ), బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ)ల సహాయం కోరతాడు. మరి జిలేబీ బాయ్స్‌ హాస్టల్‌ నుంచి ఎలా బయటపడింది. ఎమ్మెల్యే అయిన ఆమె తండ్రి రుద్ర ప్రతాప్‌రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేశాడు? అనేది చిత్ర కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని