Jio cinema: జియో సినిమాలో ఈనెల అలరించే చిత్రాలివే!

ఐపీఎల్‌తో యువతకు మరింత చేరువైన స్ట్రీమింగ్‌ యాప్‌ జియో సినిమా (Jio cinema) సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Published : 16 May 2023 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌తో యువతకు మరింత చేరువైన స్ట్రీమింగ్‌ యాప్‌ జియో సినిమా (Jio cinema) సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలైంది. ఇక రణ్‌దీప్‌ హుడా, ఊర్వశి రౌటెలా నటించిన ‘ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌’ వెబ్‌సిరీస్‌ మే 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటించిన ‘భేదియా’ మే 26 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘క్రాక్‌డౌన్‌2’ కూడా ఈ నెలలోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా స్పైషల్‌ వీడియోను పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని