
john abraham: అందుకే బాలీవుడ్‌కు ‘అటాక్’ ఇచ్చాం
ఇంటర్నెట్‌డెస్క్: జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించిన ‘అటాక్’ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ మూవీగా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. జాన్ అబ్రహాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘‘వెండితెరపై మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పరిశ్రమకు మా తరఫున ఏదైనా వినూత్నంగా అందించాలనుకున్నాం. అందులో భాగమే ‘అటాక్’. కరోనా మూడు దశలను దాటుకుని సినిమాను విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. అయినా మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమా కోసం నిజాయితీతో శ్రమించిన ప్రతి టీమ్ సభ్యుడికి ధన్యవాదాలు’’ అంటూ నెటిజన్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
ఈ పోస్ట్‌పై తన చిరకాల మిత్రుడైన హీరో అభిషేక్ బచ్చన్.. ‘నీకు మరింత శక్తి చేకూరాలి’ అంటూ కామెంట్ చేశాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?