
Satyameva Jayate 2: ‘సత్యమేవ జయతే2’.. హైవోల్టేజ్ యాక్షన్ హంగామా!
జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్‌ను ఆకట్టుకునేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘ఈ ప్రపంచం ఓ యుద్ధక్షేత్రం. మీ అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటే చూడాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు. మీరిద్దరూ గొడవపడితే శత్రువు విజయం సాధిస్తాడు’ అంటూ చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటన్నాయి. మరి సత్య, జై కలిసి కలిసి పోరాటం చేశారా? లేక వీరిద్దరూ ఒకరితో ఒకరు కలబడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెట్టింపు యాక్షన్, వినోదంతో నవంబరు 25న థియేటర్లకు రానుంది. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కూమార్ ఓ కీలక పాత్రలో నటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: హైదరాబాద్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీ
-
General News
Telangana News: ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు
-
Politics News
Jagadeesh Reddy: ప్రజల్లో వ్యతిరేకత గుర్తించాకే కేంద్రం లీకేజీలు: మంత్రి జగదీశ్‌రెడ్డి
-
General News
Obesity: మహిళలూ.. అధిక బరువు వదిలించుకోండి ఇలా..!
-
World News
Boris Johnson: ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న బోరిస్ జాన్సన్..!
-
India News
Rains: భారీ వర్షాలు.. ‘మహా’ సీఎం ఇంటి చుట్టూ వరదనీరు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్