Published : 16 Feb 2021 01:16 IST

షూటింగ్‌లో గాయపడ్డ జాన్‌ అబ్రహం

ముంబయి: బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహం షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. ‘ఎటాక్‌’ అనే యాక్షన్‌ చిత్రంలో ఫైట్‌ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టంట్‌ మాస్టర్‌.. జాన్‌ అబ్రహం మెడపై ట్యూబ్‌లైట్‌తో కొట్టే క్రమంలో మెడపై చిన్న గాయమైంది. కొద్దిపాటి రక్తస్రావం అవ్వడంతో యూనిట్‌ సభ్యులు ప్రథమ చికిత్స చేశారు. అయితే, ఇలాంటివన్నీ సినిమాల్లో భాగమేనని చెబుతూ జాన్‌ అబ్రహం ఓ వీడియో పంచుకున్నాడు. దీనిపై మరో యువ హీరో టైగర్‌ ష్రాఫ్‌ స్పందిస్తూ.. జాన్‌ ‘యాక్షన్‌ మ్యాన్‌’ అని కామెంట్‌ చేశాడు.

ఇటీవల ‘సత్యమేవ జయతే2’ చిత్రీకరణ పూర్తి చేసుకన్న జాన్‌ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను లక్ష్యరాజ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. రకుల్ ‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. గతేడాది ఆగస్టు 14 విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ రెండు చిత్రాలతో పాటు ‘పఠాన్’‌, ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌’, ‘ముంబయి సాగా’ చిత్రాల్లోనూ జాన్‌ అబ్రహం నటిస్తున్నాడు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని