Jon Landau: టైటానిక్‌ నిర్మాత కన్నుమూత

‘టైటానిక్‌’, ‘అవతార్‌’ లాంటి ఆల్‌ టైం గ్రేట్‌ హాలీవుడ్‌ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత జాన్‌ లాండౌ (63) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.

Published : 08 Jul 2024 01:24 IST

టైటానిక్‌’, ‘అవతార్‌’ లాంటి ఆల్‌ టైం గ్రేట్‌ హాలీవుడ్‌ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత జాన్‌ లాండౌ (63) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ప్రపంచ సినీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకొని, వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులను సృష్టించిన ‘టైటానిక్‌’కి ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్నారీయన. ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన జాన్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ‘‘జాన్‌ లాండౌ.. 31ఏళ్లుగా నా ప్రియమైన స్నేహితుడు. ఆయన లేకపోవడం నాలో కొంతభాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది. రెండు దశాబ్దాలుగా ఆయన నిర్మించిన చిత్రాలే కాదు.. జాన్‌ వ్యక్తిత్వం, సినిమాల పట్ల ఉన్న అంకితభావం చాలా ప్రత్యేకమైనవి’’ అంటూ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు