NTR: ఎన్టీఆర్‌పై ఆకాశమంత అభిమానం.. వినూత్నంగా థ్యాంక్స్ చెప్పిన విదేశీ ఫ్యాన్స్
ఎన్టీఆర్ (NTR )పై ఉన్న అభిమానాన్నివిదేశీ అభిమానులు వినూత్న రీతిలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ (NTR ) అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో కొమురం భీమ్ పాత్రతో అందరిని అలరించిన తారక్ పేరు గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇటీవల ఆస్కార్ వేడుకల కోసం వెళ్లిన ఎన్టీఆర్‌కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని తారక్ అభిమానులు ఆయనకు వినూత్న రీతిలో థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కోసం ఎదరుచూస్తున్నాం అని తెలుపుతూ ఒక బ్యానర్‌ను విమానం సహాయంతో ఆకాశంలో ప్రదర్శించారు. ‘‘థ్యాంక్యూ ఎన్టీఆర్. మీ 30వ సినిమా కోసం వేచి చూస్తున్నాం’’ అని రాసిన బ్యానర్‌ను ఎగరవేసి ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్‌ఏ’ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ 30 బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 23 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం