Jr.NTR: పునీత్‌ కోసం ఈ పాట.. ఇదే తొలిసారి.. ఆఖరి సారి కూడా!

కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు జూనీయర్‌ ఎన్టీఆర్‌. శుక్రవారం బెంగళూరులో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర ప్రచారాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు...

Updated : 10 Dec 2021 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. శుక్రవారం బెంగళూరులో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఆయన పాటతో నివాళి అర్పించారు ఎన్టీఆర్‌. 2016లో వచ్చిన పునీత్‌ చిత్రం ‘చక్రవ్యూహా’లోని గెలియా గెలియా పాటను పాడారు.  తారక్‌ నటుడిగానే కాకుండా సింగర్‌గానూ ప్రేక్షకులకు సుపరిచితుడే. గతంలో ఆయన హీరోగా నటించిన రభసలో ‘రాకాసి రాకాసి’, నాన్నకు ప్రేమతో ‘ఐ వానా ఫాలో యూ’ వంటి పాటలతో ప్రేక్షకులను అలరించారు. పునీత్‌తో తనకున్న అనుబంధంతో తొలిసారి కన్నడలో గెలియా పాటను పాడారు. పునీత్‌కి ఎంతో సన్నిహితుడైన తారక్‌... ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రచార వేదికపై భావోద్వేగానికి గురైయ్యారు. ‘‘ నేనెప్పుడు ఈ పాటను ఎక్కడా పాడలేదు. ఇక ఈ పాటను పాడటం ఇదే తొలిసారి, ఆఖరి సారి. ఆయన ఎక్కడ ఉన్నా... మనల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నా’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని