Jubilee: అమెజాన్‌ ప్రైమ్‌లో కొత్త సిరీస్‌ ‘జూబ్లీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అదితిరావు హైదరీ, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’ ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 20 Mar 2023 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక పక్క వేసవికి కొత్త సినిమాలు సిద్ధమవుతుంటే, ఓటీటీ వేదికలు కూడా సరికొత్త సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అదితిరావు హైదరీ కీలక పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’ (Jubilee). ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, అపరశక్తి ఖురానా, సిద్ధాంత్‌ గుప్త, వామికా గబ్బి కీలక పాత్ర పోషిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న జూబ్లీ ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. సినీ పరిశ్రమ స్వర్ణయుగాన్ని చూసిన రోజుల్లో కొందరు నటీనటుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఇందులో అదితి సుమిత్రాదేవిగా నటిస్తుండగా, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ.. శ్రీకాంత్‌రాయ్‌గా కనిపించనున్నారు. మిగిలిన నటీనటులు ఏయే పాత్రల్లో పోషించారు. నిజ జీవితంలో ఎవరికి ఆ పాత్రలు దగ్గరగా ఉన్నాయి?తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దీన్ని విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని