OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లివే.. ‘మీర్జాపూర్‌ 3’ వచ్చేస్తోంది!

ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలివే. ఏ ప్రాజెక్టు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందంటే?

Published : 04 Jul 2024 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) హవా కొనసాగుతుండడంతో ‘14’ సినిమా మినహా బాక్సాఫీసు ముందుకు ఈవారం కొత్త చిత్రాలేవీ రావట్లేదు. మరి, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దామా..!

రొమాంటిక్‌ కామెడీ.. ఫస్ట్‌ ఎపిసోడ్‌ ఫ్రీ

సోనియా సింగ్, పవన్‌ సిద్ధూ జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasi Madhanam). ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు వినోద్‌ గాలి దర్శకత్వం వహించారు. ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో గురువారం విడుదలైంది. మొత్తం ఆరు ఎపిసోడ్‌లు కాగా తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా చూడొచ్చని సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

‘మీర్జాపూర్‌’ సీక్వెల్‌

యువతలో క్రేజ్‌ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ ఒకటి. మూడో సీజన్‌ ఈ నెల 5 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ కొత్త సీజన్‌ (Mirzapur season 3) గత రెండు సీజన్లను మించి ఉంటుందని టీమ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ప్రచార చిత్రాలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మూడో సీజన్‌కు గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, ఇషా తల్వార్‌లతో పాటు ఈసారి విజయ్‌ వర్మ కూడా కనిపించనున్నారు.

మీర్జాపూర్‌ రెండు సీజన్ల కథేంటంటే?

నేరుగా ఓటీటీలోనే..

సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన ‘అహం రీబూట్‌’ (Aham Reboot) చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. స్టూడియోలో ఉన్న ఆర్జే నిలయ్‌ (సుమంత్‌)కు ఓ అమ్మాయి నుంచి సాయం కావాలంటూ ఫోన్‌ వస్తుంది. తాను కిడ్నాప్‌ అయ్యానని చెబుతుంది. మరి ఆ యువతిని ఎవరు? ఎందుకు కిడ్నాప్‌ చేశారు? ఎలా బయటపడింది? అందుకు నిలయ్‌ ఏం చేశాడు? అన్నది కథాంశం.

కూరగాయల వ్యాపారితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రేమ

పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వి. యస్‌. ముఖేశ్‌ దర్శకుడు. హర్షవర్ధన్‌, మహబూబ్‌ బాషా, ముక్కు అవినాష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 18న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ.. ‘ఆహా’(Aha)లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ, అతడి ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. దానికి కారణమేంటి? తన ప్రేమను గెలిపించుకునే క్రమంలో ఆ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? తదితర అంశాలతో రూపొందిన సినిమా ఇది.

ఓటీటీల్లో సందడి చేయనున్న మరికొన్ని ప్రాజెక్టులు..

 • నెట్‌ఫ్లిక్స్‌..
 • స్ప్రింట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌: ఇంగ్లిష్‌ ): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • డెస్పరేట్‌ లైస్‌ (హాలీవుడ్‌ ఫిల్మ్‌): స్ట్రీమింగ్‌ డేట్‌- జులై 5
 • గోయో (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ డేట్‌- జులై 5
 • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా..
 • బాబ్‌ మార్లీ: వన్‌ లవ్‌ (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • స్పేస్‌ కాడెట్‌ (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • గరుడన్‌ (తమిళ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది.

 • డిస్నీ+ హాట్‌స్టార్‌..
 • రెడ్‌ స్వాన్‌ (కొరియన్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • లయన్స్‌ గేట్‌ ప్లే
 • ఆర్థర్‌ ది కింగ్‌ (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ డేట్‌- జులై 5
 • బుక్‌మై షో
 • ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని