OTT Movies: థియేటర్లలో ‘కల్కి’ సందడి.. మరి ఈవారం ఓటీటీలో?

ఈవారం ఓటీటీలో విడుదలైన, మరికొన్ని గంటల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే?

Updated : 27 Jun 2024 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) గురువారం థియేటర్లలో విడుదలై, హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం బాక్సాఫీసు ముందుకు ఈ పాన్‌ ఇండియా మూవీ ఒక్కటే వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతున్న, మరికొన్ని గంటల్లో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే?

థియేటర్లలో సందడి చేసి.. ఇప్పుడు ఓటీటీలోకి

కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌. మే 31న థియేటర్లో రిలీజైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈనెల 28 (Bhaje Vaayu Vegam OTT Release Date) నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. క్రికెటర్‌ కావాలనుకున్న హీరోకు.. క్రికెట్‌ బెట్టింగ్‌లు వేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? బెట్టింగ్‌లో తాను గెలుచుకున్న డబ్బును ఇవ్వనందుకు ఓ గ్యాంగ్‌తో గొడవపడిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథాంశం.

నటుడు నవదీప్‌ (Navdeep) తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. రానా ఇందులో అఘోరాగా నటించారు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది.. ఆ సమయంలో ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు? అన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈనెల 7న బాక్సాఫీసు ముందుకొచ్చింది. ‘ఆహా’ (Aha)లో 27వ తేదీ నుంచి నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil). విపిన్‌ దాస్‌ దర్శకుడు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ రూ.90 కోట్లు వసూలుచేయడం విశేషం. ఇప్పుడు ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

మరికొన్ని..

 • నెట్‌ఫ్లిక్స్‌
 • వరస్ట్‌ రూమ్మేట్‌ ఎవర్‌ 2 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది 
 • సుపాసెల్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది 
 • దట్‌ నైన్టీస్‌ 2 ( హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • ఓనింగ్‌ మాన్‌హట్టన్‌ ( హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జూన్‌ 28
 • ది వర్ల్‌ విండ్‌ (కొరియన్‌ సిరీస్‌): జూన్‌ 28
 • ఎ ఫ్యామిలీ ఎఫైర్‌ (హాలీవుడ్‌ మూవీ): జూన్‌ 28

 • అమెజాన్‌ప్రైమ్‌
 • మై లేడీ జాన్‌ (తెలుగు డబ్బింగ్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • సివిల్‌వార్‌ (తెలుగు డబ్బింగ్‌): జూన్‌ 28
 • శర్మాజీ కీ బేటీ (హిందీ): జూన్‌ 28
 • జీ5
 • రౌతూ కా రాజ్‌ (హిందీ) జూన్‌ 28
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • ది బేర్‌ ( హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • ఆపిల్‌ టీవీ ప్లస్‌
 • ల్యాండ్‌ ఆఫ్‌ విమెన్‌ (హాలీవుడ్‌): స్ట్రీమింగ్‌ అవుతోంది
 • ఫ్యాన్సీ డ్యాన్స్‌(హాలీవుడ్‌) జూన్‌ 28
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని