NTR: మనది రక్తసంబంధం కన్నా గొప్పబంధం..: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

తన అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ (NTR)మాట్లాడాడు. ఇంతగా అభిమానిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

Published : 08 Mar 2023 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ (NTR)కు భారీగా అభిమానులు ఉన్నారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఏర్పడింది. తాజాగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడిన మాటలు విని ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌ అక్కడ అభిమానులతో మాట్లాడాడు. 

‘‘మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. దానికి రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది. కాకపోతే నేను దాన్ని చూపించలేకపోతున్నా. మీరందరూ స్టేజ్‌పై ఉండాలి. నేను మీలా కూర్చొవాలి. రక్తసంబంధం కంటే గొప్పబంధం మనది. మీరందరూ నా సోదరులతో సమానం. మీ ప్రేమకు, అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే.. ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియోను తారక్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తారక్‌ 30వ సినిమాగా (#NTR30) రానుంది. ఈ చిత్రంలో ఆయన సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు