jyothika: జ్యోతిక 50వ చిత్రం ‘రక్తసంబంధం’ విడుదల ఎప్పుడంటే..

జ్యోతిక తన 50వ చిత్రం  ‘ఉడన్పిరప్పే’లో ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘రక్త సంబంధం’ పేరుతో రానుంది.

Updated : 01 Oct 2021 07:18 IST

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటి జ్యోతిక గతేడాది ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ చిత్రంతో వచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా అటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. తాజాగా జ్యోతిక తన 50వ చిత్రం ‘ఉడన్పిరప్పే’లో ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘రక్త సంబంధం’ పేరుతో రానుంది. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి శర్వణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌ 14న ఈ చిత్రం అమెజాన్‌ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సముద్రఖని, శశికూమార్‌ తదితరలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని