k vishwanath: మీసం తెచ్చిన వేషం
‘శుభసంకల్పం’తో నటుడిగా మారిన కె.విశ్వనాథ్‌కు ఆ తర్వాత ‘కలిసుందాం రా’ చిత్రంలో వీర వెంకట రాఘవయ్య పాత్ర అనుకోకుండా దక్కింది.
ప్రతీ బియ్యం గింజ మీదా తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. సినిమా వేషానికీ ఇది వర్తిస్తుందేమో. వేయబోయే వేషం మీద ఆ పాత్రధారి పేరు రాసి ఉంటుంది కాబోలు. కె.విశ్వనాథ్ కథే అందుకు ఉదాహరణ. గాయకుడు బాలు ‘శుభ సంకల్పం’ చిత్రం స్క్రిప్ట్ సమయంలో అందులోని రాయుడు పాత్ర డైలాగ్స్‌ని దర్శకుడు కె.విశ్వనాథ్ వివరించిన తీరుకు ముగ్ధుడై ఆయన్ని ఒప్పించి ఆ వేషాన్ని బలవంతంగా ఆయన చేతనే వేయించడం, ఆ తర్వాత విశ్వనాథ్ నటుడుగా కొనసాగడం తెలిసిందే!
అదే విశ్వనాథ్ ‘కలిసుందాం రా’ చిత్రంలో వేషం వెయ్యడం కూడా అనుకోకుండా జరిగింది. ఆ చిత్రంలో హీరో వెంకటేష్ తాత పాత్ర పేరు వీర వెంకట రాఘవయ్య. ఆ పాత్ర కోసం చాలా మందిని ఆలోచించిన నిర్మాత సురేశ్‌బాబుకు ఎవరూ నచ్చలేదట. చివరికి షూటింగ్ దగ్గర పడటంతో రాజీ పడి సత్యనారాయణను ఎంపిక చేయాల్సి వచ్చిందట. అయితే సురేశ్‌బాబుకి లోలోపల ఏదో వెలితిగానే అనిపించిందట. ఆ నేపథ్యంలో ఓ రోజు దర్శకుడు కె.విశ్వనాథ్ తమ బంధువులకు రామానాయుడు స్టూడియోను చూపించాలని తీసుకువచ్చారట. అప్పట్లో ఆయన కోరమీసాలు పెంచేవారు. వాటితో కొత్తగా కనిపించిన విశ్వనాథ్‌ని చూడగానే సురేశ్ బాబుకి తాను ఊహించుకున్న ‘వీర వెంకట రాఘవయ్య’ పాత్ర ప్రత్యక్షమైనట్లు అనిపించిందట. ‘నిర్మాత తలచుకుంటే వేషానికి కొదవా?’. వెంటనే సురేశ్‌బాబు అప్పటికప్పుడు విశ్వనాథ్‌ని ఒప్పించారట. ఆ తర్వాత ప్రేక్షకుల్ని మెప్పించి, మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి రప్పించడం విశ్వనాథ్ వంతయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్