K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
‘కలిసుందాం రా’, ‘ఆడవారిమాటలకు అర్థాలేవేరులే’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’.. వంటి చిత్రాలతో తాతయ్య అంటే ఇలా ఉంటారని తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు కె.విశ్వనాథ్ (K Viswanath). దర్శకుడిగా రాణిస్తోన్న తరుణంలో నటన వైపు తన అడుగులు ఎలా వేశారో ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: కళాతపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ సినీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. తండ్రిగా, కుటుంబ పెద్దగా.. తప్పులు చేస్తే మందలిచ్చే తాతయ్యగా ఆయన వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించారు. దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన విశ్వనాథ్.. అసలు నటుడిగా ప్రయాణం ఎలా మొదలుపెట్టారు? ఆయన విలన్‌గా కనిపించిన సినిమాలేమిటి? ఇలాంటి ఎన్నో అంశాలపై ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విశేషాలివే..!
బాలు మాటతో..!
‘‘నేను తెర వెనకే తప్ప తెరపైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అది చాలా గమ్మత్తుగా జరిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balu) నిర్మాతగా ‘శుభ సంకల్పం’ (Subha Sankalpam) ప్రారంభించాం. అందులో రాయుడు పాత్ర చాలా ముఖ్యమైనది. కమల్‌హాసన్ (Kamal Haasan) ఎప్పుడూ చేతులు కట్టుకుని ఆయన ముందే నిలబడతాడు. కాబట్టి, కాస్త గంభీరమైన వ్యక్తిని పెడదామనుకున్నాం. శివాజీ గణేశన్‌ను అనుకున్నాం. కానీ, ఏవో కారణాల వల్ల అది జరగలేదు. ఈలోగా సినిమా షూట్ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. ‘ఇంతకీ రాయుడు పాత్రధారి ఎవరో తేల్చవేమిటి’ అని ఓసారి ఎస్పీ బాలుని అడిగా. ‘ఆయనెవరో ఆల్రెడీ మేం నిర్ణయించుకున్నాంలే’ అన్నాడతను. ‘అదేమిటోయ్, నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు’ అన్నాను. ‘ఆ పాత్రను మీరే పోషిస్తున్నారు’ అన్నాడు. ‘చాల్లే వేళాకోళం’ అన్నాను. ‘వేళాకోళం కాదు, నిజంగానే చెబుతున్నాను. ఆ పాత్రకు మీరైతేనే సూటవుతారు’ అన్నాడు. నేను కోప్పడ్డాను. ‘ఏం మాట్లాడుతున్నావ్? నేను డైరెక్షన్‌లో ఉన్నానంటే మరో విషయాన్ని పట్టించుకోనని నీకు తెలుసు కదా. అలాంటిది ఏకంగా పెద్ద పాత్రనే పోషించమంటావేంటి’ అన్నాను. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. చివరికి బాలూ ‘మీరెమ్మన్నా చెప్పండి. కథ చెప్పేటప్పుడే ఆ పాత్రకు మీరైతేనే సరిగ్గా సరిపోతారని నాకనిపించింది. మీరా పాత్ర పోషించేటట్లయితేనే సినిమా తీద్దాం. లేదంటే మానేద్దాం’ అని కోపంగా వెళ్లిపోయాడు. నాకో పట్టాన ఆ విషయం జీర్ణం కాలేదు. యూనిట్‌లో మరికొందరు వచ్చి నచ్చజెప్పారు. చివరికి అంగీకరించక తప్పలేదు. అలా మొదటిసారి ముఖానికి రంగు వేసుకున్నాను’’
ఆ తర్వాత విలన్‌గా చేయలేదు..!
‘‘నన్ను తొలుత నటించమని గట్టిగా బలవంతం చేసిన వారు ఇద్దరు కమల్, బాలు! కాబట్టి, నేను బాగా నటించడానికి బాధ్యులు కూడా వారే. నేను వారి చిత్రానికి సాయపడతానన్నారు. దాంతో చేయక తప్పలేదు. విలన్ వేషం వేస్తే ఆ తర్వాత మంచి పాత్రలు రావేమోనని నేను తటపటాయించలేదు. ఎందుకంటే పాత్రల కోసం నేను ఎదురుచూడలేదు. నా పాత్ర క్లిక్ అవుతుందని అనుకోలేదు. కానీ, ప్రేక్షకులను అది ఆకట్టుకుంది. అయితే ‘ద్రోహి’ తర్వాత మరే చిత్రానికీ నేను విలన్‌గా చేయలేదు. అంతేకాకుండా, మొక్కుబడికి ఐదారు సీన్లు ఉన్న పాత్రలు చేయాలనిపించలేదు. ఎందుకంటే నన్ను నేను అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు’’
నటుడిగా విశ్వనాథ్ అలరించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు-పాత్రలు
నటుడిగా విశ్వనాథ్ దాదాపు 30 సినిమాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ ఆయన కీలకపాత్రలు పోషించారు. ‘హైపర్’ తర్వాత ఆయన తెలుగులో ఏ చిత్రంలోనూ నటించలేదు. మరి, ఆయన పోషించిన కొన్ని కీలకపాత్రలు ఏమిటంటే..
- శుభ సంకల్పం - రాయుడు పాత్ర
- కలిసుందాం రా - వెంకటేశ్‌కు తాతయ్యగా..
- నరసింహ నాయుడు - బాలకృష్ణకు తండ్రి పాత్రలో
- నువ్వు లేక నేను లేను - తాతయ్య పాత్ర
- సంతోషం - హీరోయిన్‌కు తండ్రిగా..
- స్వరాభిషేకం - శ్రీకాంత్‌కు అన్నయ్యగా..
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - త్రిషకు తాతయ్య పాత్రలో..
- పాండురంగడు - బాలయ్యకు తండ్రి పాత్రలో..
- మిస్టర్ పర్‌ఫెక్ట్ - తాప్సీకి తాతయ్యగా..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్