KRK: సేతుపతి, సమంత, నయనతార లవ్‌స్టోరీ.. ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌

విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార కలిసి నటించిన ప్రేమకథా చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదలైంది.

Updated : 20 May 2022 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార కలసి నటించిన ప్రేమకథా చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal). తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదలైంది. అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ వేదికగా సందడి చేయబోతుంది. మే 27 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్‌ కానుంది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

క‌థేంటంటే: ర్యాంబో (విజ‌య్ సేతుప‌తి) (Vijay Sethupathi) త‌న‌ని తాను దుర‌దృష్ట‌వంతుడిగా భావిస్తుంటాడు. చిన్నప్ప‌ట్నుంచి త‌న చుట్టూ జ‌రిగిన సంఘ‌ట‌న‌లు అలాంటివి. త‌న‌కి ఇష్ట‌మైంది ఏదీ త‌న‌కి ద‌క్క‌దు. త‌న త‌ల్లికి కూడా దూరంగా ఉంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంద‌ని భావిస్తుంటాడు. కానీ, త‌న త‌ల్లి మాత్రం ఏదో ఒక రోజు ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌వుతావ‌ని, నీకు ఇష్ట‌మైన‌వన్నీ నీకు ద‌క్కుతాయ‌ని ర్యాంబోతో చెప్తుంది. ప‌ట్నం వెళ్లి ప‌గ‌లు క్యాబ్ డ్రైవ‌ర్‌గా, రాత్రిళ్లు ప‌బ్‌లో బౌన్స‌ర్‌గా ప‌నిచేస్తున్న ర్యాంబోకి త‌న త‌ల్లి చెప్పిన‌ట్టుగానే ఒకేసారి ఇద్ద‌రి మ‌న‌సుల్ని సొంతం చేసుకుని, వారి ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌వుతాడు. క‌ణ్మ‌ణి (న‌య‌నతార‌) (Nayanthara), ఖ‌తీజా (స‌మంత) (Samantha)లను ప్రేమించిన ర్యాంబోకి ఆ త‌ర్వాత అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతుంది? ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌కీ విష‌యం తెలిశాక ఏం జ‌రిగింది? ఇద్ద‌రిలో ర్యాంబో ఎవ‌రిని ఎంచుకున్నాడ‌న్నది మిగతా కథ (Kanmani Rambo Khatija).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని