RamCharan: రామ్‌చరణ్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు..

స్టార్‌హీరోగా వరుస సినిమాలు చేస్తూ, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌ తనకున్న ఫేమ్‌తో తనని ఆరాధించేవారికి చేయనైనంత సాయం చేస్తుంటారు...

Updated : 13 Apr 2022 11:57 IST

అసలేం జరిగిందంటే

హైదరాబాద్‌: స్టార్‌హీరోగా వరుస సినిమాలు చేస్తూ, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌.. సాయం కోరిన వారికి చేయూతనందిస్తుంటారు. తన తండ్రి ప్రారంభించిన చిరు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేదికగా సేవలందిస్తుంటారు. చరణ్‌లోని సేవాగుణాన్ని నటుడు కాదంబరి కిరణ్‌ తాజాగా బయటపెట్టారు. అతడి గొప్పతనాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

‘‘మెగాస్టార్‌ తనయుడు, స్టార్‌హీరోగానే మనకు రామ్‌చరణ్‌ తెలుసు. కానీ, ఆయన పెద్ద మనసున్న వ్యక్తి. సాటి మనిషికి సాయం అందించే వ్యక్తిత్వం కలవాడు. గతంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్‌ అన్న చొరవతో చరణ్‌ని సాయం అడిగితే రూ.2 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బుతో ‘మనం సైతం’ ద్వారా కార్యక్రమాలన్నీ పూర్తి చేశాను. ఇలా మరికొంత మంది నుంచి మరో లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాప పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించాం. అయితే.. ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత తాజాగా నేను రామ్‌చరణ్‌కు ఎదురుపడ్డాను. ఆయన నన్ను చూసి.. ‘‘కాదంబరి గారూ.. ఆ పాప ఎలా ఉంది’’ అని అడిగారు. అతడి వ్యక్తిత్వానికి నా గుండె నిండిపోయింది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాదంబరి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చెర్రీని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు