kaduva: ఓటీటీలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘కడువా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva).

Updated : 29 Jul 2022 15:22 IST

హైదరాబాద్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva). సంయుక్త మేనన్‌ కథానాయిక. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఆగస్టు 4వ తేదీ నుంచి ‘కడువా’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ట్రైలర్‌ను విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని