Kaduva: రెండు పరిశ్రమల కలయికలో చిత్రాలొస్తాయి!
భవిష్యత్తులో నా సినిమాలన్నిటినీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తానన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran). ఆయన కథానాయకుడిగా షాజీకైలాస్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘కడువా’(Kaduva). సంయుక్త మేనన్ (Samyuktha Menon) కథానాయిక. వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ముఖ్యభూమిక పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘‘నేను చేసిన సినిమాలు ఇక్కడ రీమేక్ అవుతుండడం ఆనందంగా ఉంది. ‘భీమ్లానాయక్’(Bheemla Nayak) తర్వాత ‘గాడ్‌ఫాదర్’ (God father) వస్తోంది. త్వరలోనే తెలుగు, మలయాళం పరిశ్రమల కలయికలో పెద్ద ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకొంటాయనే నమ్మకం ఉంది. ‘కడువా’ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ ‘‘ఇద్దరు బలమైన వ్యక్తుల మద్య ఓ బుల్ ఫైట్‌లా ఉంటుందీ చిత్రం. నా కెరీర్‌లో ఫోన్‌లోనే ఓకే చేసిన చిత్రం ‘లూసిఫర్’. ఈ కథని పృథ్వీరాజ్ ఫోన్‌లోనే చెప్పాడ’’న్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త మేనన్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
-
India News
Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
-
Politics News
Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం