పెళ్లి కార్డులపై ఆ పేరే ఉంది: కాజల్‌

ప్రముఖ వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్నాక తన జీవితం రంగులమయంగా ఉందని నటి కాజల్‌ అగర్వాల్‌ తెలిపారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా...

Published : 13 Feb 2021 02:05 IST

ఇప్పుడు జీవితం అద్భుతం మారింది అంటోన్న నటి

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్నాక తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ సిరీస్‌లో కాజల్‌ భాగమైంది. హాట్‌స్టార్‌ వేదికగా తాజాగా ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు.

‘‘వివాహం తర్వాత నా జీవితం ఎంతో అద్భుతంగా మారింది. వృత్తిపరమైన జీవితాల్లో మేమిద్దరం ఎప్పుడూ బిజీగానే ఉంటుంటాం. కానీ, ఒక్కసారి ఇంటికి రాగానే మిగిలిన విషయాలను మర్చిపోయి మేమిద్దరం సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాం. వివాహం తర్వాత నాతో కొంత సమయం గడపడానికి ఎప్పుడైనా గౌతమ్‌ సెట్‌కు వస్తే అక్కడ ఉన్నవారందరూ ఆయనను గౌరవించడం, ఒక కుటుంబసభ్యుడిలా చూసుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది’’

‘‘మా పెళ్లి కార్డులపై ‘కిచ్డ్‌’ అనే పేరే వాడాం. దాంతో ఇటీవల మేము ప్రారంభించిన హోమ్‌ డెకోర్‌ బ్రాండ్‌కు కూడా అదే పేరు పెట్టాం. ఈ బ్రాండ్‌ నుంచి ఎన్నో గృహోపకరణాలను విడుదల చేయనున్నాం. దీనితోపాటు మరో గేమింగ్‌ కంపెనీలో కూడా నేను వాటా కొనుగోలు చేశాను’’ అని కాజల్‌ తెలిపారు.

ఇదీ చదవండి

పాట కోసం దుస్తులు తొలగించమన్నారు

వైష్ణవ్‌.. నీ భయం నాకు తెలుసురా

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని