Published : 05 Aug 2022 00:10 IST

Indian 2: ‘భారతీయుడు 2’పై కాజల్‌ క్లారిటీ.. షూటింగ్‌ పునఃప్రారంభం ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రీకరణ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభం గురించి చిత్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. త్వరలోనే ‘భారతీయుడు 2’ పునః ప్రారంభంకాబోతుందని తెలిపారు. కానీ, ఏ నెలలో అనేది చెప్పలేదు. దాంతో, ఈ సినిమా మళ్లీ పట్టాలెప్పుడెక్కుతుందోనన్న ప్రశ్న అలానే ఉండిపోయింది. తాజాగా.. కథానాయిక కాజల్‌ అగర్వాల్‌  (Kajal Aggarwal) నుంచి సమాధానం వచ్చింది. బాలీవుడ్‌ నటి నేహా ధూపియాతో కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పలు విషయాలపై చర్చించారు. సినీ కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరు 13 నుంచి భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నా’’ అని తెలిపారు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి కాజల్‌ వైదిగారు’ అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపైనా స్పష్టత వచ్చినట్టైంది.

దర్శకుడు శంకర్‌- కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సంచలన చిత్రం ‘భారతీయుడు’. సేనాపతి పాత్రలో కమల్‌ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘భారతీయుడు 2’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 2020లో సెట్లో ప్రమాదం జరగడం, కొవిడ్‌, దర్శకనిర్మాతల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా నిలిచిపోయింది. మరోవైపు, కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాతో, శంకర్‌.. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఆర్సీ 15’తో బిజీ అయ్యారు. దాంతో ‘భారతీయుడు 2’ ఉంటుందా, లేదా? అనే చర్చ మొదలైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘విక్రమ్‌’ ఇటీవల విడుదలై, ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని