ఆ ఇంటి వల్ల నిద్ర కూడా పోలేదు: కాజల్‌

ప్రస్తుతం దక్షిణాదిన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కాజల్‌ ఒకరు. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. కరోనా.. ఆ తర్వాత వివాహం వల్ల కొంతకాలం కెమెరాకు దూరంగా ఉంది.

Published : 12 Feb 2021 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం దక్షిణాదిన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కాజల్‌ ఒకరు. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. కరోనా.. ఆ తర్వాత వివాహం వల్ల కొంతకాలం కెమెరాకు దూరంగా ఉంది. ఈ ఏడాది ఏకంగా ఆరు ప్రాజెక్టుల్లో నటిస్తోందామె. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో, మంచు విష్ణు సరసన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మోసగాళ్లు’లోనూ ఆమె నటిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ‘లైవ్‌టెలికాస్ట్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. అది ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సూపర్‌ హిట్‌ షో చిత్రీకరణ కోసం ఇంట్లోకి వెళ్తుంది చిత్రబృందం. షూటింగ్‌ చేసే ఈక్రమంలో వాళ్లున్న ఇంటికి అతీంద్రియ శక్తులున్నాయనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్లు షూటింగ్‌ పూర్తి చేశారా..? ఆ ఇంట్లో నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. అయితే.. ఈ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ను చిత్రీకరించే క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను కాజల్‌ పంచుకున్నారు. ఏకాంత ప్రదేశంలో షూటింగ్‌ చేయడం వల్ల తాను భయపడి నిద్ర కూడా పోలేదని ఆమె వెల్లడించింది.

‘మేము షూటింగ్ చేసిన ఇల్లు కొండపై ఉండేది. అది డైరెక్టర్‌ స్నేహితుడిది. దానికి చుట్టుపక్కల పరిసరాల్లో ఇంకో ఇల్లు కూడా లేదు. వాతావరణం కూడా నిర్మానుష్యంగా చాలా భయంకరంగా ఉండేది. ఈ వెబ్‌సిరీస్‌కు అలాంటి స్థలమే సరైంది. అయితే.. ఆ షూటింగ్‌ అయిపోగానే ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లిన నాకు నిద్రపట్టేది కాదు. విపరీతంగా భయపడిపోయాను. వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకూ ఏరోజూ నేను సరిపడా నిద్రపోయింది లేదు’ అని కాజల్‌ చెప్పుకొచ్చింది.
ఇవీ చదవండి..

చిరు-బాబీ.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

చిరు-బాబీ.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని