Kajal Aggarwal: నటి కాజల్‌ కొడుకు పేరేంటో తెలుసా?

కాజల్‌ అగర్వాల్‌ తన తనయుడికి పెట్టిన పేరేంటో మీకు తెలుసా.. లేదంటే ఇది చదివేయండి...

Published : 20 Apr 2022 16:12 IST

ముంబయి: ప్రముఖ సినీతార కాజల్‌ అగర్వాల్‌ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. అనేకమంది అభిమానులు, సినీ ప్రముఖులు అందాల చందమామకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, పుట్టిన బాబుకు ఈ దంపతులు ఏం పేరు పెడతారోనన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో కాజల్‌ భర్త, పారిశ్రామికవేత్త గౌతమ్‌ కిచ్లూ తమకు మగబిడ్డ పుట్టాడనీ.. నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టినట్టు బుధవారం ఇన్‌స్టాలో అధికారికంగా వెల్లడించారు. తమ పట్ల ప్రేమ చూపించి ఆశీర్వదించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో అగ్రస్థాయి హీరోలతో నటించిన కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో 2020 అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాతా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి సరసన ఆమె నటించిన ‘ఆచార్య’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని