Kajal Aggarwal: వైభవంగా కాజల్‌ అగర్వాల్‌ సీమంతం

 ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ మరికొన్ని నెలల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

Published : 21 Feb 2022 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ మరికొన్ని నెలల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు సీమంతం వేడుక చేశారు. అతికొద్దిమంది బంధువులు, స్నేహితులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ మధురమైన జ్ఞాపకాలను కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా (స్టోరీస్‌) ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎరుపు రంగు చీరలో కాజల్‌, రెడ్‌ బ్లేజర్‌లో కనిపించారు. ప్రస్తుతం.. ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాజల్‌.. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు 2020లో వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సినిమా విషయానికొస్తే.. దుల్కర్‌ సల్మాన్ సరసన కాజల్‌ నటించిన ‘హే సినామిక’ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న విడుదలకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని