గుర్రమెక్కిన చందమామ

కాజల్‌.. అందం, అంతే చక్కని అభినయంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన చందమామ. ఈ కథానాయిక ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భామ తిరిగి తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను

Updated : 22 Sep 2022 06:22 IST

కాజల్‌.. అందం, అంతే చక్కని అభినయంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన చందమామ. ఈ కథానాయిక ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భామ తిరిగి తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ.. ప్రసవానంతరం తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి రాసుకొచ్చింది. ‘‘ప్రసవానంతరం 4నెలల తర్వాత తిరిగి నా పనిలోకి వెళ్లాను. గతంలో నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడలా లేదు. తల్లి అయ్యాక నా శరీరంలో ఎన్నో మార్పులొచ్చాయి. గుర్రాన్ని ఎక్కడం, దానిపై స్వారీ చేయడం చాలా పెద్ద పనిలా అనిపించింది. శరీరంలో మార్పులు రావొచ్చు. కానీ, మనలోని నేర్చుకోవాలన్న తపనకు ఏదీ అడ్డుకాదు. ప్రతికూల పరిస్థితులను, బలహీనతలను గట్టి మనోధైర్యంతో ఎదిరించి ముందుకెళ్లాలి’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కాజల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని