Kajal Aggarwal: బాలకృష్ణ సరసన కాజల్‌... షూటింగ్‌ షురూ!

Kajal Aggarwal: బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్ర సెట్స్‌లోకి కాజల్‌ అగర్వాల్‌ అడుగు పెట్టారు.

Updated : 20 Mar 2023 20:22 IST

హైదరాబాద్‌: స్టార్‌ కథానాయికగా యువ హీరోలందరితోనూ ఆడిపాడిన కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ఇప్పుడు అగ్ర హీరోలతోనూ జోడీ కడుతున్నారు. బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే108 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్‌ నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను పంచుకుంది. ఈ క్రమంలోనే కాజల్‌  ఈ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వివాహం, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్‌ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే తెలుగులో ‘కోస్టీ’ పేరుతో మార్చి 22న విడుదల కానుంది. ఇక ఇప్పుడు బాలకృష్ణ చిత్రంతో పాటు, ‘ఇండియన్‌2’, ‘కరుంగపియమ్‌’, ఉమ’ చిత్రాల్లో కాజల్‌ నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని