Kajal Aggarwal: మై లవ్‌.. నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను..: కాజల్‌

కాజల్‌ తన కుమారుడు నీల్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Published : 20 Oct 2022 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఓ అందమైన పోస్ట్‌ అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ఆమె కుమారుడు నీల్‌ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా కాజల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ లేఖ రాసింది. ‘‘అప్పుడే నువ్వు పుట్టి 6 నెలలు అవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్‌ మదర్‌గా నీ విషయంలో నేను మొదట భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మై లవ్‌.. మై నీల్‌..’’ అని రాసింది కాజల్‌. 

ఈ పోస్టుకు తన కుమారుడి ఫొటోను జత చేసింది. ఆమె ఈ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే  6 లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని