Kajal: డెలివరీ తర్వాత మార్పులు సహజమే కానీ..: కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
అందం, అభినయం కలిసిన అందాల తార కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన ఆలనా పాలనా చూసుకుంటున్న ఈ భామ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: అందం, అభినయం కలిసిన అందాల తార కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన ఆలనా పాలనా చూసుకుంటున్న ఈ భామ తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఇన్‌స్ట్రాలో గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. బాబు పుట్టిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘‘బాబు పుట్టిన 4 నెలల తర్వాత ఎంతో ఆత్రుతగా, ఉత్సాహంగా నేను తిరిగి పనిలోకి అడుగుపెడుతున్నాను. అయితే.. ఇది అంతకు ముందులా ఉంటుందని నేను అనుకోవడం లేదు. గతంలో నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. బాబు పుట్టాక వ్యాయమం చేయకుండా నా శరీరానికి పూర్తి విశ్రాంతి ఇచ్చాను. ప్రసవానంతరం గతంలో ఉన్నట్లు ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి పొందడం చాలా కష్టంతో కూడుకున్నది. గుర్రాన్ని ఎక్కడం, దానిపై స్వారీ చేయడం చాలా పెద్ద పనిలా అనిపించింది. అంతకు ముందు నాకు చాలా సులభంగా అనిపించిన వ్యాయామం చేస్తుంటే.. ఇప్పుడు నా శరీరం దానికి సహకరించట్లేదు. ప్రసవానంతరం మన శరీరంలో మార్పులు రావొచ్చు. కానీ మనలోని నేర్చుకోవాలనే తపనకు ఏదీ అడ్డుకాదు. మనం ప్రతి రోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన ఎంపికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోవాలి’’
ఇక భారతీయుడు2 (indian 2) గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని అలవాట్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. ఈ పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిరంతరం నేర్చుకోవాలనిపించేలా అవకాశాలు వస్తున్నాయి. అందుకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
The Sycamore Gap: ప్రఖ్యాత సైకమోర్ గ్యాప్ వృక్షం నరికివేత.. 16 ఏళ్ల బాలుడి దుశ్చర్య..!
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్టెల్కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు