Published : 09 May 2022 01:55 IST

Kajal: మొదటిసారి తనయుడి ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

హైదరాబాద్‌: నటి కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటివరకూ తన కుమారుడి ఫొటోలను ఎక్కడా బయటపెట్టలేదు. అయితే.. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కుమారుడితో కలిసి ఉన్న పలు ఫొటోలను తాజాగా షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ఆ చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. నీల్‌ అంటే తనకెంత ఇష్టమో తెలియజేస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ సమంత, రాశీఖన్నా, హన్సిక.. ఇలా పలువురు సెలబ్రిటీల్ని ఆకర్షించింది.

‘‘డియర్‌ నీల్‌.. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాకెంత ప్రత్యేకమో తెలియజేయాలనుకుంటున్నా. మొదటిసారి నిన్ను చేతుల్లోకి తీసుకున్న వేళ, నీ చిట్టి చేతుల్ని తాకి, నీ అందమైన కళ్లు చూసినప్పుడే నాకర్థమైంది.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని. ప్రతి విషయంలో నువ్వే నా మొదటి ప్రాధాన్యం. రానున్న రోజుల్లో అన్నివిషయాలను నీకర్థమయ్యేలా తెలియజేసేందుకు సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తాను. కానీ, నువ్వు ఇప్పటికే నాకు ఎన్నో విషయాలు నేర్పించావు. జీవితంలో అద్భుతమైన క్షణాలు ఎలా ఉంటాయో నాకు పరిచయం చేశావు. అమ్మంటే ఏమిటో, నిస్వార్థంగా జీవించడం, స్వచ్ఛమైన ప్రేమ, శరీరం వెలుపల కూడా హృదయం ఉండటం సాధ్యమేనని నీ వల్లే నాకు తెలిసింది. ఇలాంటి ఎన్నో మధురానుభూతులను నాకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి నువ్వే అయినందుకు ధన్యవాదాలు. ఈ ప్రపంచాన్ని నీ వెలుగులతో నింపాలని, ఇతరుల కోసం సాయం చేయాలనే మంచి మనసుతో నువ్వు ఎదగాలని నేను ప్రార్థిస్తున్నా. నువ్వే నా సూర్యుడివి, వెన్నెలవి. నువ్వే నా చిన్ని తారవి’’ అని కాజల్‌ రాసుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని