Kajal: ప్రియమైన భర్తకు.. త్వరలో మన జీవితాల్లో మార్పులు రానున్నాయ్‌

తన భర్త గౌతమ్‌ కిచ్లూని ఉద్దేశిస్తూ నటి కాజల్‌ అగర్వాల్‌ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు.  కాజల్‌ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నారు....

Published : 14 Apr 2022 11:14 IST

గౌతమ్‌ని ఉద్దేశిస్తూ కాజల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌: తన భర్త గౌతమ్‌ కిచ్లూని ఉద్దేశిస్తూ నటి కాజల్‌ అగర్వాల్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పోస్టు చేశారు. కాజల్‌ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి మహిళా జీవితంలో గొప్పగా చెప్పుకునే ఈ మధురక్షణాల్లో గౌతమ్‌ తనని అన్నివిధాలుగా సంరక్షిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. త్వరలో తమ జీవితాల్లో గొప్ప మార్పులు రానున్నాయని, ఇప్పటిలా ఏకాంత సమయాలు గడపలేమని, పార్టీలు, సినిమాలు, షికార్లు ఉండవని అన్నారు. పుట్టబోయే బిడ్డతో ప్రతిక్షణం తమ జీవితం మరింత ఆనందంగా మారనుందని ఆమె పేర్కొన్నారు.

‘‘డియర్‌ గౌతమ్‌.. ఓ మంచి భర్తగా, నాకెప్పుడూ తోడుగా ఉన్నందుకు, ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. అలసటగా అనిపించి, రాత్రివేళల్లో సరైన నిద్రలేనప్పుడు.. నువ్వు కూడా నాతోపాటే నిద్రలేచి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. ఈ సమయంలో నాకు అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేశావు. నాకెలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతిక్షణం నన్ను ఎంతగానో సంరక్షించావు. సంతోషంగా ఉండేలా చేశావు. త్వరలో మన ముద్దుల బేబీ ఈ లోకంలోకి రానుంది. ఆలోపు.. నువ్వు ఎంత అద్భుతమైన వ్యక్తివో నీకు తెలియజేయాలనుకుంటున్నా..!!

గడిచిన ఎనిమిది నెలల్లో నీలో నేను ఒక గొప్ప తండ్రిని చూశాను. పుట్టబోయే మన బిడ్డను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో, తన సంరక్షణ కోసం ఎంతలా శ్రమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చూపించే ఈ అమితమైన ప్రేమ మన బిడ్డ అదృష్టంగా భావిస్తున్నా. ఇలాగే ఏ విషయంలోనైనా నువ్వు ఎప్పుడూ తనకి ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా.

త్వరలో మన జీవితాల్లో ఎంతో మార్పు రానుంది. ఇప్పటిలా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. ప్రతి వారాంతంలో సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ షోలు చూసుకుంటూ ఆలస్యంగా నిద్రపోలేం. అతిముఖ్యంగా పార్టీలు, డేట్‌ నైట్స్‌కు దూరమవుతాం. వీటన్నింటికీ మనం దూరమైనప్పటికీ మన బేబీతో విలువైన సమయాన్ని గడుపుతాం. తనతో మన జీవితంలోని ప్రతిక్షణం మరింత ఆనందంగా మారనుంది. నిద్రలేని రాత్రులు, అనారోగ్యానికి గురికావడం, మనకంటూ ఒక సమయాన్ని కేటాయించలేకపోవడం వంటివి ఉన్నప్పటికీ ఇవి మన జీవితాల్లో ఉత్తమమైన క్షణాలు. పరిస్థితులు మారొచ్చు కానీ, నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్‌ యూ’’ అని కాజల్‌ రాసుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని