Kajol: ఓటీటీ కోసం మరొకటి
ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది నటి కాజోల్. ఆమె ఇప్పటికే ‘త్రిభంగా’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో ఓటీటీలోకి
ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది నటి కాజోల్ (Kajol). ఆమె ఇప్పటికే ‘త్రిభంగా’(Tribhanga) అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney Plus HotStar) కోసం ఓ వెబ్‌సిరీస్ (Web Series) చేసేందుకు అంగీకారం తెలిపింది. దీన్ని సుపర్ణ్ వర్మ తెరకెక్కించనున్నారు. ఇదొక హై కాన్సెప్ట్ కథాంశంతో రూపొందుతోంది. క్రైమ్, రాజకీయాలతో మిళితమైన యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇందులో కాజోల్ ఓ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాజోల్ ప్రస్తుతం రేవతి దర్శకత్వంలో ‘సలాం వెంకీ’ చిత్రంలో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!