Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్‌

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులో (48)లోనే ఆయన చనిపోవడం చర్చనీయాంశంమైంది. ఫలానా కారణంగానే సాగర్‌ మృతి చెందారంటూ కోలీవుడ్‌ వర్గాలు, సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతోంది.

Published : 01 Jul 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (Vidya Sagar) అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్వాసకోస సమస్యతో ఆయన బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఫలానా కారణంగానే సాగర్‌ మృతి చెందారంటూ కోలీవుడ్‌ వర్గాలు, సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ విషయమై మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ స్పందించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

‘‘కొవిడ్‌ బారిన పడకముందు విద్యాసాగర్‌కు బర్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ అయిందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ తర్వాత, ఈ ఏడాది జనవరిలో ఆయన కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మీనా తల్లి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఫిబ్రవరిలో మేం కలిశాం. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. మార్చిలో.. ఓసారి మీనా ఫోన్‌ చేసి, ‘సాగర్‌ హెల్త్‌ బాలేదు’ అని తెలిపింది. నేను ఆస్పత్రికి వెళ్లి పలకరించా. ఆ రోజు నా పుట్టిన రోజు కావడంతో సాగర్‌ నాకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడూ ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఏప్రిల్‌లో సీరియస్‌ అయింది. సాగర్‌ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు తెలిపారు. దీనికోసం మూడు నెలలు ప్రయత్నించాం. తమిళనాడు మంత్రులు, ముఖ్యమంత్రి.. ఇలా ఎందరినో సహాయం కోరాం. అంతా హెల్ప్‌ చేశారు కానీ అవయవం లభించలేదు. రోజురోజుకూ సాగర్‌ ఆరోగ్యం క్షీణించింది. తుదిశ్వాస విడిచే వరకూ సాగర్‌ ఎంతో ధైర్యంగా ఉన్నారు. తన భర్తను కాపాడుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించింది. చిన్న వయసులోనే సాగర్‌ మరణించడం చాలా బాధకరం. ఆయన్ను మిస్‌ అవుతున్నా’’ అని కళా మాస్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని