Kalaavathi: మహేశ్ బాబు ‘కళావతి’.. తమిళం, హిందీ వెర్షన్ విన్నారా..!
ఇంటర్నెట్ డెస్క్: ‘కళావతి’.. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్న గీతమిది. విడుదలైన అనతికాలంలో 60 మిలియన్లకుపైగా వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన పాట ఇది. ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఈ సాంగ్ తెలుగువారినే కాదు తమిళ, హిందీ శ్రోతల్ని విశేషంగా అలరించింది. భాష అర్థమవకపోయినా కొందరు ఈ గీతాన్ని ఆస్వాదించారు. మరికొందరు ఇదే ట్యూన్‌కు తమ మాతృభాషలో సాహిత్యం అందించి, తమదైన శైలిలో ఆలపించారు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన తమన్ మెప్పు పొందారు. ఒరిజినల్ పాటకు దీటుగా రూపొందిన ఈ ఫ్యాన్‌మేడ్ వెర్షన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. ఈ ఆసక్తికర యాక్షన్- కామెడీ చిత్రంలో మహేశ్ మునుపెన్నడూ కనిపించని లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు. ఆయన సరసన కీర్తి సురేశ్.. కళావతిగా సందడి చేయనుంది. ఈ పాత్రనుద్దేశించి అనంత శ్రీరామ్ రాసిన ‘కళావతి’ గీతాన్ని సిధ్ శ్రీరామ్ పాడారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana news: స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌పై కక్ష కట్టారు: భట్టి
-
Sports News
Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
-
Politics News
Telangana news: రాజగోపాల్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు: జీవన్ రెడ్డి
-
Movies News
Janhvi Kapoor: నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్
-
Politics News
Dharmana Prasad Rao: పవన్ పోస్టర్ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనం!
-
Politics News
Muralidhar Rao: తెరాసలో భూకంపం రాబోతోంది: మురళీధర్‌రావు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!