
కె.విశ్వనాథ్ బర్త్‌డే: సర్‌ప్రైజ్ ఇచ్చిన ఫ్యాన్స్
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమకు అపురూప చిత్రాలను అందించిన దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. మాస్, కమర్షియల్ సినిమాలే కాదు, కథ, కథనాలు బలంగా ఉంటే, సంస్కృతి, సంప్రదాయాలతోనూ సినిమా తీసి హిట్ కొట్ట వచ్చని నిరూపించిన దర్శక లెజెండ్ ఆయన. తాజాగా కె.విశ్వనాథ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను ఒక జాబితాగా తయారు చేసి, కేక్ లోపల చుట్టి పెట్టారు. దాన్ని కె.విశ్వనాథ్ ముందుంచి ఆయన చేతితోనే ఆ సినిమా జాబితాను పైకి లాగేలా చేసి, ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.