kalki 2898 ad collections: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ‘కల్కి 2898 ఏడీ’

kalki 2898 ad collection worldwide: ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.900 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.

Updated : 08 Jul 2024 18:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ  రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు (kalki 2898 ad collection worldwide) చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉంది. ఇదే హవా కొనసాగితే ఒకట్రెండు రోజుల్లో రూ.1000 కోట్లు మార్కును అందుకోవడం ఇక లాంఛనమే. అప్పుడు ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రంగా ‘కల్కి’ నిలుస్తుంది.

మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం.

ఇక నార్త్‌ అమెరికాలో ఇప్పటివరకూ ఏ దక్షిణాది చిత్రమూ సాధించని అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు, బుక్‌ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. అలాగే, హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అతి తక్కువ సమయంలో రూ.3కోట్లు కలెక్ట్‌ చేసిన చిత్రంగా కల్కి నిలిచింది.

  • ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు (గ్రాస్‌) సాధించిన చిత్రాలివే!
  • దంగల్‌ (2016) రూ.2,024 కోట్లు
  • బాహుబలి2 (2017) రూ.1,810 కోట్లు
  • ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) 1,387 కోట్లు
  • కేజీయఫ్‌2 (2022) రూ.1,250 కోట్లు
  • జవాన్‌ (2023) రూ.1,148 కోట్లు
  • పఠాన్‌ (2023) రూ.1,050 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని