Kalki: కొనసాగుతోన్న ‘కల్కి’ హవా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే!

కలెక్షన్స్‌ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది.

Published : 06 Jul 2024 15:13 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (prabhas) కీలక పాత్రలో నాగ్‌ అశ్విన్‌ (Director nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2829 ఏడీ’ హవా కొనసాగుతోంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే రూ.191.5 కోట్లు వసూలు చేసిన ‘కల్కి’ ఇప్పుడు రూ.800కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం పోస్ట్‌ పెట్టింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘కల్కి 2829 ఏడీ’ విడుదలకు ముందే అమెరికాలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అక్కడ ఈ చిత్రం నిడివి తగ్గించినట్లు తెలుస్తోంది. దాదాపు 3 గంటలపైన నిడివి ఉన్న ‘కల్కి’.. ఇకపై 2.45 గంటలు ప్రదర్శితం కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ పెట్టిన ఓ పోస్టర్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని