Kalki 2898: మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?

కలెక్షన్స్‌ పరంగా ‘కల్కి 2898 ఏడీ’ మరో మైలురాయి దాటింది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది.

Published : 04 Jul 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కలెక్షన్స్‌ విషయంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 700 కోట్లకుపైగా వసూళ్లు (Kalki Worldwide Collections) చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె (Deepika Padukone) పాత్రకు సంబంధించిన లుక్‌ను హైలైట్‌ చేయడం విశేషం. ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్‌పై నాగ్‌ అశ్విన్‌ పోస్ట్‌

భారీ అంచనాల నడుమ జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. మరోవైపు, యాస్కిన్‌ పాత్రకూ సీక్వెల్‌లో నిడివి ఎక్కువగా ఉండనుంది. సినీ ప్రముఖులు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజువల్‌ వండర్‌ అంటూ కొనియాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని