Kalki: ‘సలార్‌’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘కల్కి’.. ఎన్ని టికెట్స్‌ అమ్ముడయ్యాయంటే!

తన సినిమా రికార్డులను తానే బ్రేక్‌ చేశారు ప్రభాస్‌. గతంలో ఆయన నటించిన ‘సలార్‌’ రికార్డును ‘కల్కి’ బ్రేక్ చేసింది.

Published : 25 Jun 2024 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే కొన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేయగా.. ఇప్పుడు ‘సలార్‌’ (Salaar) రికార్డును కూడా అధిగమించింది. 

ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగానే (జూన్‌26) విడుదల కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి ప్రభాస్‌ (Prabhas) గత చిత్రం రికార్డును బ్రేక్ చేశాయి. ‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేసింది. ఈ చిత్రం ప్రీ సేల్స్‌ ప్రారంభించిన గంటల్లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇక ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

పెళ్లి రూమర్స్‌కు చెక్‌.. ‘చిన్న కథ కాదు’ అంటూ కొత్త సినిమా ప్రకటించిన నివేదా..

మరోవైపు ‘కల్కి’ ఓపెనింగ్‌ కలెక్షన్లు రూ.200 కోట్లు ఖాయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్‌ గతంలో నటించిన ‘బాహుబలి-2’, ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సాహో’ చిత్రాలు మొదటిరోజు రూ.100కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. వీటికంటే ‘కల్కి’కి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశమున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అగ్ర నటీనటులు అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌ (Kamal Haasan) తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా వీరంతా నాగ్‌ అశ్విన్‌పై, ‘కల్కి’ కథపై ప్రశంసలు కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని