Yashoda: ఆ రుగ్మత నాక్కూడా ఉంది.. యశోద సక్సెస్‌ మీట్‌లో నటి

కొన్ని రోజులుగా సమంత మయోసైటిస్‌తో  బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా సమంత రుగ్మతపై నటి కల్పిక గణేష్‌ స్పందించారు.

Published : 21 Nov 2022 13:35 IST

హైదరాబాద్‌: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘పడి పడి లేచే మనసు’ వంటి చిత్రాల్లో సహాయనటిగా మంచి  గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్‌(Kalpika Ganesh). తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద(Yashoda)లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఈ సినిమా సక్సెస్‌ మీట్‌కు హాజరైన కల్పిక.. సమంతను గుర్తుచేసుకున్నారు.

‘‘యశోద విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సక్సెస్‌మీట్‌లో సమంతను చాలా మిస్‌ అవుతున్నాం. మాతో ఆమె వస్తుందని చెప్పారు. అందుకే నేను ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్‌ కూడా క్యాన్సిల్‌ చేసుకుని వచ్చాను. నేను 13 సంవత్సరాలుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నాను. సమంతకు ఉన్న మయోసైటిస్‌ రుగ్మత నాక్కూడా  ఉంది.  కాకపోతే నేను మొదటి స్టేజ్‌లో ఉన్నా.. సమంత మూడో స్టేజ్‌లో ఉంది. నేను ఒకసారి సమంతను కలిసి ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. ఆమె త్వరగా కోలుకోవాలి’ అని కల్పిక అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని