Bimbisara: బింబిసారుడిగా కల్యాణ్‌ రామ్‌ విశ్వరూపం.. కొత్త ట్రైలర్‌ అదిరింది

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’ కొత్త ట్రైలర్‌ విడుదలైంది. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Published : 27 Jul 2022 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను పంచుకోగా ఇప్పుడు ‘రిలీజ్‌ ట్రైలర్‌’తో సినీ ప్రియులకు వినోదాన్ని అందించింది. ఈ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు, కల్యాణ్‌ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్‌ రామ్‌ పోషించిన మరో పాత్రను ఇందులో చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. హైదరాబాద్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని